Home

Slider

శ్రీ వేదజనని బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్

శ్రీవేదజనని బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ 2015 సంవత్సరములో బ్రాహ్మణులకొరకు ఏదో చేయాలి అన్న తపననుండి ఆవిర్భవించినది.ట్రస్ట్ ఆవిర్భావమునుండి విశాఖపట్నంలో సింహాచలమునకు చేరువలో మా కార్యాలయమునందు నిత్యాన్నదానము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బ్రాహ్మణ కార్పొరేషన్ పధకములపై అవగాహన కల్పించడము, అర్హులయినవారికి కుల ధృవీకరణ పత్రములు జారీచేయడము, స్త్రీలకు కుట్టు శిక్షణ కార్యక్రమములు నిర్వహించడము, వ్రతములు, నోములు, ఉపనయనములు చేసుకోవాలనుకునేవారికి తగిన సహాయము చెయడము, ఆధ్యాత్మిక గ్రంధాలయము మొదలగు అనేక కార్యక్రమములు నిర్వహిస్తూవస్తున్నాము.

కాశీవాసము(Accommodation)

కాశీ దర్శించు బ్రాహ్మణ బంధువులు ముందుగా మమ్మల్ని సంప్రదించి మా కాశీవాసము లో గదులు బుక్చేసుకొనవచ్చును. నాన్ ఏ.సి. రెండుపడకల గదులు, 4 పడకల గదులు అద్దెకు లభించును. హరిశ్చంద్రఘాట్ రోడ్డులోను, హనుమాన్ ఘాట్ వద్ద మరియు క్షమేశ్వర్ ఘాట్ వద్ద కల మా వసతిగృహములందు రూములు బుక్ చేసుకొనవచ్చును.

శ్రీమతి మహేంద్రవాడ లక్ష్మీ నరసమాంబ స్మారక బ్రాహ్మణ నిత్యాన్నదాన క్షేత్రం

మా తల్లిగారయిన కీ.శే. శ్రీమతి మహేంద్రవాడ లక్ష్మీనరసమాంబగారు అక్టోబరు 16, 2017 న ఒక రోడ్డుప్రమాదములో స్వర్గస్థులయినారు. అప్పటినుండి మా నిత్యాన్నదాన క్షేత్రమునకు శ్రీమతి మహేంద్రవాడ లక్ష్మీనరసమాంబ స్మారక బ్రాహ్మణ నిత్యాన్నదానక్షేత్రం అని పేరు పెట్టడం జరిగినది. అదేపేరుతో కాశీలో శంకరమఠం ఎదురుగా క్షమేశ్వరఘాట్ ఆనుకొని వున్న మా గెస్ట్ హౌస్ లో ప్రారంభించబడినది.కాశీ దర్శించు బ్రాహ్మణులు మా అన్నదానక్షేత్రములో ఉదయము 10-00 గంటలలోపు తమ పేరు నమోదుచేయించుకొని మధ్యాహ్నము 12-30 గంటలనుండి భోజనము, రాత్రి 7-00 గంతలనుండి ఫలహారము పొందవచ్చును.

Tour Packages

Kaasi Yaatra 3 Days
3 Days 3 Nights

5000

Kaasi Yaatra 5 Days
5 Days 5 Nights

8000

మావద్ద లభించు సేవలు

61dd8f0ae37ec27e13443b3873c48284